Take a fresh look at your lifestyle.

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం : అడిషనల్ కలెక్టర్ వెంకా రెడ్డి ఘనంగా అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు.
భువనగిరి పట్టణంలో శుక్రవారం అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకంతో పాటు రెడ్ క్రాస్ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ “రెడ్ క్రాస్ సంస్థ మానవత్వానికి ప్రతీక అని1863లో హెన్రీ డ్యునాంట్ చే స్థాపించబడిన ఈ సంస్థ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల సమయంలో కుల,మత, ప్రాంతాలకు అతీతంగా బాధితులకు సేవలందిస్తోందని తెలిపారు.
రెడ్ క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ గుర్రం లక్ష్మీ నర్సింహారెడ్డి, డివిజన్ కమిటీ చైర్మన్ సద్ది వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కావున సేవా దృక్పథం కలవారు రెడ్ క్రాస్ లో మెంబర్ షిప్ తీసుకోవాలని కోరారు. జిల్లాకు బ్లడ్ బ్యాంక్, జిల్లా కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో త్వరలోనే స్థలం మంజూరు చేసుకుని భవన నిర్మాణం చేపట్టుకుందామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, జిల్లా కమిటీ డైరెక్టర్లు శేక్.హమీద్ పాశ, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,జంపాల అంజయ్య, రాంబాయి, కార్యదర్శి క్రిస్టోఫర్, డివిజన్ కమిటీ డైరెక్టర్ ఐలేని రామ్ రెడ్డి,లావణ్య,రెడ్ క్రాస్ సభ్యులు కరిపె నర్సింగ్ రావు, బండారు శ్రీనివాస్,బిజ్జాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.