వారాబంది విధానాన్ని రద్దు చేసి ఏప్రిల్ 15 వరకు నిరంతరాయంగా ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని రైతులకు అందించాలి
- సాగునీరు నిరంతరాయంగా విడుదల చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం
- బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లపాక సాయిబాబు
తుంగతుర్తి, ముద్ర: చేతికొచ్చిన పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయని పంట పొలాలకు నిరంతరాయంగా ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగు నీరు అందించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తుంగతుర్తి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి “మల్లెపాక సాయిబాబు” మాట్లాడుతూ రైతు వేసిన పంట నష్టపోకుండా ఉండాలంటే వారబందీ విధానానికి స్వస్తి చెప్పి ఇప్పటినుండి ఏప్రిల్ 15 వరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇప్పటి వరకు రైతు పంటల మీద వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఖర్చు చేశారని,వారాబంది విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని,పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు.ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయకపోతే రైతులు భారీ స్థాయిలో నష్టపోతారని,కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని,రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదని, రుణమాఫి పూర్తి చేయలేదని,సన్న వొడ్లకు బోనస్ ఇవ్వలేదని అన్నారు.రైతులకు నీరందించకుంటే ఆమరణ నిరాహారా దీక్షకు సిద్ధమేనని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు నాగరాజు, నర్సింహా రెడ్డి, గాజుల మహేందర్, కత్తుల నరేష్, సత్యనారాయణ, ఉప్పుల లింగయ్య, రఫీక్, యాదగిరి, సాయికృష్ణ, శ్రీనివాస్, సంక్రు నాయక్, లింగస్వామి,మహేష్, రమేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.