Take a fresh look at your lifestyle.

గ్రామపంచాయతీ అధికారి సంతకం ఫోర్జరీ

  • నిందితునిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

కోరుట్ల/కథలాపూర్, ముద్ర: గ్రామపంచాయతీ నుండి జారీ చేసే ధ్రువీకరణ పత్రాల విషయంలో సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేశారు.పూర్తి వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తిప్ప పల్లి గ్రామానికి చెందిన యాగండ్ల చిన్నరాజ్యం తన ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం గ్రామపంచాయతీ సెక్రటరీ బొడ్డు మహేష్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు సర్టిఫికెట్స్ ఇంట్లో చేసి ఇంటిని యాగండ్ల చిన్న రాజం పెద్ద కోడలు పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు.ఈ విషయం కాస్త బయటకు రావడంతో ధృవీకరణ పత్రం పరిశీలించిన కార్యదర్శి నేను జారీ చేసింది కాదు నా సంతకం ఫోర్జరీ చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇటీవలే నిందితుడు ఆస్తితగాదాల నేపథ్యంలో అన్నతో పాటు వదినపై కూడా దాడి చేసిన విషయం తెలిసిందే “ఆస్తి తగాదాలతో అన్నపై తమ్ముడు గొడ్డలి తో దాడి” అనే వార్త ముద్ర పత్రికలో పక్షం రోజుల క్రితం ప్రచురితమైంది.దీంతో పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.