Take a fresh look at your lifestyle.

వట్టెం దేవస్థానంలో అన్నసత్రానికి అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో నిత్య అన్నదాన సత్రానికి అదనపు వసతి నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నిర్మాణ పనులకు దాతలుగా చిలుక సురేందర్ రెడ్డి–పావని దంపతులు, సూరమ్ రాజమహేంద్ర రెడ్డి–సునీత దంపతులు ముందుకు వచ్చారు.

 

దేవస్థానం ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి, నవీన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన శాశ్వత సభ్యులు కోర్త చంద్రా రెడ్డి, దెంది కృష్ణావ రెడ్డి, చెన్న కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నసత్రానికి అదనపు వసతి ఏర్పాటుతో భక్తులకు మరింత సౌకర్యం కలగనుందని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.