Take a fresh look at your lifestyle.

జనగణనలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు క్యాంపు కార్యాలయంలో డిజిటల్ జనగణన కార్యక్రమంలో తమ వివరాలను నమోదు చేసుకుని ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రతి పౌరుడు ప్రొవిజనల్ గైడ్‌లైన్స్ ప్రకారం తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు జనాభా గణన, గృహ బాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.