Take a fresh look at your lifestyle.

ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. : మంత్రి అడ్లూరి

మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించాం..
ముస్లీంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్, ధర్మపురి:


రాష్ట్ర ప్రభుత్వం ముస్లీంల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లోని ఈద్గా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ముస్లీంల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ. 7కోట్లు కేటాయించినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువతి, యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ధర్మపురి నియోజకవర్గంలో 10వ తరగతి, ఇంటర్ పూర్తి అయిన యువతి, యువకుల స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల రుణాలు బ్యాంకు ద్వారా ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఆసక్తి కలిగి న యువతి, యువకులు రుణాలు పొంది స్వయం ఉపాధి పొందాలని మంత్రి అడ్లూరి కోరారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.