Take a fresh look at your lifestyle.

ఘనంగా రంజాన్ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఈద్గా వద్ద, ఖిల్లాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లిం మైనార్టీ సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఆడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్యా, బాలే శంకర్, పంబాల రాంకుమార్, దుమాల రాజ్ కుమార్, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.