Take a fresh look at your lifestyle.

నూకపల్లి ఇందిరమ్మ కాలనినీ జగిత్యాల కలపడం కోసం క్యాబినెట్ ఆమోదం

  • జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నూకపల్లి ఇందిరమ్మ కాలనినీ జగిత్యాల కలపడం కోసం క్యాబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదంతో పాటు గవర్నర్ కూడా ఆమోదం తెలపడం జరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  అన్నారు.జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 29 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల డబల్ బెడ్ రూం ఇండ్ల కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 35 కోట్లను మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.5 వేల ఇండ్లు దాదాపు 20 వేల మంది ప్రజలు నూకపల్లి ఇందిరమ్మ కాలానికి వెళ్తారని తెలిపారు. జగిత్యాల పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 350 కోట్ల అంచనాతో ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని, వచ్చే నెల 4 న ఉన్నత అధికారులతో డిల్లీ లో సమావేశం ఉందని తాను ప్రత్యక్షంగా హాజరు కానున్నట్లు తెలిపారు.జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కలిసి పనిచేసి నిరంతరం కృషి చేస్తానని,జిల్లా కేంద్రం లో క్రిటికల్ కేర్ యూనిట్ సైతం త్వరలోనే ప్రారంభం కానుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హయం లో అభివృద్ధి సంక్షేమం రెండు ప్రధాన అంశాలని,ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సరఫరా, సన్న బియ్యం, ఇందిరా క్రాంతి భవనం, రుణాలు, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతిలక్ష్మణ్, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, బాలే శంకర్, తాజా మాజీకౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.