ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులకు మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో పార్టీ ఫిరాయించడానికి గల కారణాలను వెల్లడించారని కోరారు. నిబంధనలకు విరుద్దంగా ఎలా నిర్ణయం తీసుకున్నారని కూడా అగినట్లగా తెలుస్తోంది. ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. స్పీకర్ పక్షాన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటీసులు ఇచ్చారు. అయితే వివరణ ఇచ్చేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమయం కావాలని కోరినట్లు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన 10 శాసనసభ్యులు ఆ పార్టీని వీడి…అధికార పార్టీలో చేరారు.దీంతో వారి సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్‌ఎస్ గత కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతుంది. సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. అంతేకాదు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు కనీస సమాధానం కూడా ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో స్పందించిన సుప్రీంకోర్టు స్పీకర్ పై సీరియఎస్ అయింది. వారిపై చర్యలు తీసుకోవడానికి ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది.
నోటీసులతో బీఆర్ఎస్ అలర్ట్..
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు రావడంతో గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. శాసన సభలో పార్టీ విప్ గా కెపీ వివేకానంద గౌడ్ ను, శాసనమండలిలో పార్టీ విప్‌గా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు స్పీకర్ ను అధినేత ప్రకటనను అందజేశారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను, శాసనమండలి చైర్మన్ లను విప్‌లు కోరారు.