Take a fresh look at your lifestyle.

రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు సర్వేనెంబర్ 178 లో ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి

ముద్ర, బీబీనగర్ :
బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలోని ఇండ్లు లేని పేదలందరికీ సర్వే నెం. 178లో స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో సర్వేనెంబర్ 178 లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి చంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో ఇదే స్థలంలో ఇల్లు లేని పేదలతో గుడిసెలు వేశామని అట్టి గుడిసెలను అప్పటి తహసిల్దార్ పోలీసుల సహకారంతో తొలగించారని అన్నారు. అధికారుల చర్యలను నిరసిస్తూ తహసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించి అధికారులతో చర్చలు జరిపిన సందర్భంగా అప్పుడు ఆర్డిఓ కృష్ణారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండో విడతలో తప్పకుండా ఆ గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఇంటి స్థలం లేని పేదలందరికీ కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయిస్తామని అన్నారని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆర్డిఓ గారు చొరవ చూపి రాయరావుపేట గ్రామంలోని స్థలం లేని వారందరికీ స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బండారు శ్రవణ్ కుమార్, సీనియర్ నాయకులు గాడి శ్రీనివాస్, పోరుబోతుల జంగయ్య, గాడి చిన్న శ్రీనివాస్, గడ్డమీది కృష్ణ, రొంపి కౌసల్య, ఎరుకల జయమ్మ, ఉప్పరి వెంకటరెడ్డి, సోను, ధనేశ్వరి, మకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.