వికలాంగులకు ఎన్నికలో నామినేట్ పోస్టులు అమలు చేయాలి: ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి..
6000 రూపాయలు పెన్షన్ వెంటేనే అమలు చేయాలి..
ముద్ర, మోత్కూర్ :
వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించి 6వేల రూపాయలు పెన్షన్ వెంటేనే అమలు చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం
మోత్కూర్ మండల కేంద్రంలో ఎన్ పి ఆర్ డి పట్టణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ
గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వికలాంగులకు సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖ లోనే కొనసాగిస్తురని వికలాంగులకు ఎంత బడ్జెట్ అనేది తెలియక ఇప్పటికే అర్థమయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక వికలాంగుల సంక్షేమ శాఖ ని వెంటనే అమలు చేసి గతంలో ఉన్న పెన్షన్ బకాయి పడ్డ డబ్బులు వెంటనే అమలు చేయాలన్నారు. వికలాంగులకు పరికరాలు ఇస్తామని ఇప్పటికీ మూడు దఫాలో అప్లికేషన్ పెట్టుకున్నా ఏ ఒక్కరికి బడ్జెట్ లేదని పరికరాలు పంపిణి చేసె పరిస్థితి లేదని, వికలాంగులకు ఉపాధి అవకాశాల్లో రుణాలు ఇస్తామని ఇప్పటికీ బ్యాంకు ద్వారా ఏ మాత్రం రుణం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 10 లక్షల రూపాయలు రుణం వెంటనే ఇవ్వాలన్నారు. వికలాంగులకు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చిన ఇప్పటికీ 27 నెలలు గడిచిన 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, అంతో దయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం, ఎన్నికలలో అవకాశం కొరకు నామినేటెడ్ పోస్టులు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి ఎన్ పి ఆర్ డి డివిజన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, మోత్కూరు మండల అధ్యక్షులు ఎర్రవెల్లి నాగేష్, టౌన్ అధ్యక్షులు గౌలికర్ రాజు, మున్సిపాలిటీ అధ్యక్షులు గుండు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,అప్పల యాదగిరి, వెంకటేష్, మహిళా కన్వినర్ మంజుల, గొడిశాల యాదగిరి, చేతరాశి రమేష్, జయభిక్షం, ఎండి జమాల్, ఎస్.కె కాశీం పాల్గొన్నారు.