Take a fresh look at your lifestyle.

మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో అందిస్తున్న మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులను, డార్మెటరీ హాల్ తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడుతూ ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. అలాగే భోజన శాలను పరిశీలించి, ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రధానంగా నాణ్యతను పరీక్షించి, వంట సామాగ్రి, సరుకులు, బియ్యం తదితరాలను తనిఖీ చేసి, గడువు తేదీలను సరిచూసుకోవాలన్నారు.పాఠశాల లోని పరిసర ప్రాంతాలు పరిశీలిస్తూ పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. అలాగే విద్యార్థులలో పాఠ్యాంశాలపై అవగాహన పెంచే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు.పట్టుదలతో కష్టపడి చదివి ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.