రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి అభివృద్ధి సంక్షేమ సాధ్యం ఎమ్మెల్యే మందుల సామేల్,ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
ముద్ర, తుంగతుర్తి..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తోటే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు బందుల సామేలు ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలు అన్నారు గురువారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో మల్లన్న గుట్ట వద్ద 15 కోట్లతో పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న గోదాములకు ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, తో కలిసి ఎమ్మెల్యే సామెల్ శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసమే గోదాములు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే విధానాన్ని అవలంబిస్తూ పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు.రైతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా రైతు సంక్షేమాన్ని బలోపేతం చేస్తోందన్నారు.విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపడుతోందనీ తెలిపారు.ప్రజలే మా ప్రభుత్వానికి బలం అని వారి సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం అన్నారు.ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,తహసిల్దార్ దయానందం,ఎంపీడీవో శేష్ కుమార్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్విని, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు యోగానంద చారి, రేగటి రవి,గిడ్డంగుల సంస్థ డి.ఈ రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్,వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు,వెలుగుపల్లి గ్రామ కార్యదర్శి రఘు,కాంగ్రెస్ పార్టీ యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.