Take a fresh look at your lifestyle.

అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం అని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై రెడ్ రన్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ నగేష్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సునీత, డిసిహెచ్ఎస్ డా. శివ దయాల్, నర్సింగ్ కాలేజ్ బాలికలు
హాజరయ్యారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి రామ్ దాస్ చౌరస్తా వరకు వరకు ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎయిడ్స్ ఒక నివారించలేని వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీనిని అరికట్టవచ్చని తెలిపారు.
అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తం, వాడిన సిరంజీల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వివరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సురక్షిత పద్ధతులను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలన్నారు.
జిల్లాలో 385 హెచ్ఐవి ఎయిడ్స్ కేసులున్నాయన్నారు.
రాందాస్ చౌరస్తాలో ఎయిడ్స్ నివారణపై
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ… ఎటువంటి భయోందాలకు గురికాకుండా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించుకోవాలని పాజిటివ్ అని నిర్ధారణ అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ హెచ్ఐవి వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో, పట్టణాల్లో ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు కళాజాతలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొని, వ్యాధి గురించి సరైన సమాచారం తెలుసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్, ఇతర సంబంధిత వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.