న్యూఢిల్లీ :
తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం వివరణ ఇచ్చింది. మంగళవారం లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర సామాజిక, న్యాయవాద మంత్రి బీపీఎల్ శర్మ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు వచ్చాయన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ కార్యదర్శి నుంచి రెండు బిల్లులు వచ్చాయన్నారు. ఆ రెండు బిల్లులు పరిశీలన దశలో ఉన్నాయని స్పష్టం చేశారు.