Take a fresh look at your lifestyle.

సత్తి రెడ్డి నగర్‌లో డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

 ముద్ర :మల్కాజిగిరి

ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని సత్తి రెడ్డి నగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ కాలనీ వాసులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ పనులు ఉపయోగపడతాయని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, సాగర్ రెడ్డి, హేమా, దీపిక, సుమతి, అర్చన పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటించారు.
కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.