Take a fresh look at your lifestyle.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 

 ముద్ర, తాండూర్ :

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఐకెపి  ఆధ్వర్యంలో, అగ్గనూర్ గ్రామంలో పిఎసిఎస్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వరి ధాన్యం’ కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. దళారులను దళారులనునమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ద్వారానే దొడ్డు రకం క్వింటాల్ కు రూ.2,389/- సన్న రకం బియ్యం రూ.500/- బోనస్ తో మద్దతు ధర ప్రభుత్వం ద్వారానే అందిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా వంటలు పండించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రాథమిక సహకార సంఘ సభ్యులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.