ముద్ర పెబ్బేరు
వనపర్తి జిల్లా కేంద్రానికి ఇటీవలే నూతన డిఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన గిరిబాబును బుధవారం పోలీస్ కార్యాలయంలో పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన బున్యాధిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని, సమస్యలను త్వరితగతీన పరిష్కరించాలని ఆయనను కోరారు. డి.ఎస్.పి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ లో భాగమై ప్రతి ఒక్కరు పనిచేయాలని వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంటిస్టెంట్ సర్పంచ్ వనం మల్లేష్ యాదవ్, సురేష్, మేకల విజయ్, నరసింహ, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.