Take a fresh look at your lifestyle.

విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి – ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

 
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేసిక్ లెవెల్ జాబ్స్ అంతా కూడా కంప్యూటర్లో ఉంటుందని,విద్యార్థులు ప్రతి అంశం పై అప్డేట్ కావాలని, ప్రపంచం తో కనెక్ట్ లేకుంటే కెరియర్ మీద ఇంట్రెస్ట్ లేకుంటే చదువు టైం పాస్ అనుకుంటే కచ్చితంగా వెనుకపడతారన్నారు. అందుకే పీజీ, డాక్టరేట్ ఏమైనా చేయండి కానీ ప్రపంచం తో కనెక్ట్ లేకుండా బయట ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటే ఎలాంటి స్కిల్స్ చేయాలి అనుకుంటే చేయలేరన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ కచ్చితంగా ప్రతినెల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే విద్యార్థులో మంచి స్కిల్స్ అలవడుతుందని ఎమ్మెల్యే సూచించారు. గ్రామీణ, పట్టణం నుంచి వచ్చేవాళ్ళు అకాడమిక్ లో ఎన్ని తెలివితేటలు ఉన్నా ,శిక్షణ లేకుంటే ఇబ్బంది పడతారన్నారు.. ఎక్కడ కాంపిటీషన్ ఉంటే అక్కడ మన పిల్లల్ని పంపియ్యాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషనర్ డాక్టర్. ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.