Take a fresh look at your lifestyle.

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం

మాదాపూర్, ముద్ర విలేఖరి: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) 12వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పబ్బ మల్లేశం గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సీనియర్ నాయకులు గజ్జల యోగ నంద్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్బంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. దేశంలోనే తలసేమియా చిన్నారుల కోసం అత్యధిక యూనిట్లను సేకరించిన సంస్థగా ఇంటర్నేషనల్ వైశ్యఫెడరేషన్,ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం తగ్గిపోతుండడంతో తలసేమియా, ఇతరత్రా వ్యాధిగ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందని, రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని,అన్ని దానంల కన్న రక్త దానం గొప్పది అని, రక్తదానం చేద్దాం ఇతరుల ప్రాణాలు కాపాడండి అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనప్పుడు రక్తం అవసరం చాలా ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఎవరు కూడా భయపడకుండా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని చైర్మన్ గాంధీ గారు కోరారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన ప్రతినిధులను చైర్మన్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది.రక్తదాతలకు ప్రశంస పత్రాలను,పురస్కారాలను చైర్మన్ గాంధీ అందజేయడం జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలు ప్రాణ దాతలతో సమానము అని చైర్మన్ గాంధీ అన్నారు.ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది.తల సేమియా వ్యాధి చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఐవీఎఫ్ నిరంతరాయంగా రక్తదాన శిబిరాలను డాక్టర్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ గాంధీ గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, నరేందర్ బల్లా, పబ్బ మల్లేష్ గుప్త, గంప సత్యనారాయణ గుప్త, దారం లక్ష్మయ్య గుప్త ,చిన్నం సత్యనారాయణ, కట్ట రవి గుప్తా, కంచర్ల వెంకటేష్ గుప్త, ఉట్కూరి శ్రీనివాస్ గుప్త ,గౌరీ శంకర్ గుప్త, ముత్యాల శ్రీనివాస్ గుప్త , పబ్బ శ్రీనివాస్ గుప్త సంపత్ గుప్త ,మురళి గుప్త, జయకృష్ణ గుప్త, ఐత భాస్కర్, గుప్త, కోటేశ్వర రావు గుప్త , పచ్చిపులుసు శ్రీనివాస్ గుప్త, పృధ్వీ గుప్త, మల్లికార్జున్ గుప్త, కే వి గుప్త, నటరాజు గుప్త, సాయి బాబా గుప్త, మారం వెంకట్ గుప్త , ప్రభాకర్ గుప్త , జయకిశోర్ గుప్త, శ్రీధర్ గుప్త ,రాచూరి కృష్ణ ,.వినీత్ గుప్త , గాయత్రి , లలిత , హెల్త్ క్యాంప్ కి హకరించిన డా,క్టర్స్ బాండారి హాస్పిటల్స్ డాక్టర్ శుశ్రుత్,. డాక్టర్ పీయస్ రాహుల్ . డాక్టర్ నీలిమ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.