Take a fresh look at your lifestyle.

కష్టాలు ఎన్నెదురైనా ధర్మాన్ని వీడొద్దని లోకానికి చాటిన వ్యక్తి జగన్నాథుడు

  • గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్.

గచ్చిబౌలి, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నల్లగండ్ల లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ ముఖ్య అతిథిలుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై జగన్నాథ్, హరేకృష్ణ , హరేరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సన్మార్గాన్ని చూపిన గురువు జగన్నాథుడని అన్నారు. కృష్ణచైతన్య తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన బృందావనం శ్రీల ప్రభుపాద అడుగుజాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలను నిర్వహిస్తూ భగవంతుడికి సేవచేసే అవకాశాన్ని కల్పిస్తోంది అన్నిఅన్నారు. ప్రజా సేవ అంటే పరమాత్ముడి సేవ అని అన్నారు.ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. ప్రజల కష్టాలు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రజా ప్రతినిధులు ,భక్తులు, మహిళలు, చిన్నారులు,స్థానిక నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.