ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లాలో జనగణన ఇళ్ల జాబితా నమోదు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్వీయ గణన ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని 1,68,677 ఇళ్లలో వివరాల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 1,439మంది ఎన్యుమరేటర్లు, ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున
261మంది, 25మంది ఇంచార్జ్ అధికారులను నియమించారు. నేటి నుంచి ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి బ్లాక్ నెంబర్ల కేటాయింపుతో పాటు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
తొలి దశ గృహాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. రెవెన్యూ గ్రామాల ఆధారంగా 700 నుంచి 800 మందికి ఒక బ్లాక్‌గా జిల్లాలో 1695 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లుగా విభజించారు.
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,68 లక్షల కుటుంబాలు ఉండగా… జనాభా 7,67, 428 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3,78, 654మంది మహిళలు 3,88,774 మంది ఉన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post