Take a fresh look at your lifestyle.

16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

రైతులను తేమ పేరుతో, మాచర్ రావడం లేదని 16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి మండలం వీరవెల్లి గ్రామంలో ఐకెపి కేంద్రాన్ని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, భువనగిరి మండల సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జక్కా రాఘవేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తోటకూరి శంకరయ్య, మాజీ ఎంపీటీసీ కంచు మల్లయ్య, చింతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్, పుట్ట వీరేష్, సింగిల్ విండో డైరెక్టర్ చింతల వెంకటరెడ్డి, రేగు శ్రీశైలం, బండసోమవారం సర్పంచ్ కటిక జంగయ్య, రాసాల శేఖర్ యాదవ్, బాత్కా అశోక్, కడారి బాలు యాదవ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.