Take a fresh look at your lifestyle.

కొండగట్టు చిన్న జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్

మల్యాల, ముద్ర: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 11-4-2025 నుండి 13-04-2025 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లును శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు,లైట్స్,చలవ పందిర్లను ఏర్పాటు చేయాలని, భక్తులు స్నానమాచరించే పరిసరాలను పరిశీలించారు.భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు లను సిద్దం చేయాలని ఆలయ అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఓ, తాసిల్దార్ మునీందర్, ఆర్ఐ తిరుపతి, ఈవో శ్రీకాంత్ రావు, సూపరిండెంట్లు సునీల్, చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.