– లేడీస్ సర్కిల్ ఇండియా సహాకారంతో రూ.4లక్షల వ్యయంతో రెండు అంగన్‌వాడీల సుందరీకరణ
– బక్రీచెప్యాల, తడ్కపల్లిలో అంగన్‌వాడీలను ప్రారంబించిన లేడీస్ సర్కిల్ ప్రతినిధులు
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
అంగన్‌వాడీల అభివృద్దితో చిన్నపిల్లలకు మేలు జరుగుతుందని లేడీస్ సర్కిల్ నేషనల్ ప్రెసిడెంట్ శీసం సబర్వాల్, శివాని టిబ్రివాల్, సికింద్రాబాద్ లేడీస్ సర్కిల్ 17చైర్‌పర్సన్ భావన సుమన్ అన్నారు.

లేడీస్ సర్కిల్ ఇండియా, రోటరీ లేక్ మొయినాబాద్ సంస్థ సహాకారంతో సిద్దిపేట అర్బన్ మండలం బక్రీచెప్యాల, తడ్కపల్లి గ్రామంలోని అంగన్‌వాడీలను రూ.4లక్షల వ్యయంతో పునరుద్దరణ పనులు చేసి వాటిని సంస్థ ప్రతినిధులు శనివారం ప్రారంబించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ. రెండు గ్రామాల్లో అంగన్‌వాడీలను రేనోవేట్ చేశామన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌లలో పిల్లలు ఆరోగ్య, ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను సమకూర్చడం జరిగిందన్నారు. త్రాగునీటి ట్యాంకు, కిటీకీలు, పెయింటింగ్, డోర్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెంటర్లను పరిశుభ్రంగా ఉంచడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ వాటిని అభివృద్ది చేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని అంగన్‌వాడీ సెంటర్లను ఎంపిక చేసుకుని అందులో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బక్రిచెప్యాల గ్రామ సర్పంచ్ శ్రీలత, పంచాయితీ సెక్రటరీ శ్రీవాణి, అంగన్‌వాడీ సెంటర్ టీచర్ పద్మ, ప్రతినిధులు భావనసుమన్, గ్రామ నాయకులు శ్రీనివాస్, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.