Take a fresh look at your lifestyle.

సర్పమిత్రుడు యాసిన్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆయన వస్తే చాలు…. బుసలు కొట్టే త్రాచు ఐనా పడగ దించాల్సిందే. ఎక్కడ పాము కనిపించినా వెంటనే గుర్తొచ్చే పేరు షేక్ యాసిన్. నిర్మల్ పట్టణానికి చెందిన షేక్ యాసిన్ వృత్తి రీత్యా వాహనాల అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తుంటాడు. ఎక్కడైనా పాము కనిపిస్తే ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుని అడవుల్లో వదిలేస్తాడు. నామమాత్రపు ఫీజు తీసుకుని పాములు పడుతున్నా ఒక్కోసారి ప్రాణాలకు తెగించి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందంటారు యాసిన్. ఐతే అర్ధరాత్రి ఫోన్ చేసినా క్షణాల్లో వచ్చి పామును పట్టుకుంటాడు. శుక్రవారం వాసవి ఉన్నత పాఠశాల సమీపంలో పొడవైన కొండచిలువను పట్టుకుని వదిలేశాడు. అవసరం ఉన్నవాళ్ళు 97044 22950 కాల్ చేయవచ్చని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.