ముద్ర ప్రతినిధి, భువనగిరి :
నిజాం నిరంకుశ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటిగా
అమరుడైన గొప్ప నాయకుడు దొడ్డి కొమురయ్య అని నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని తాజ్పూర్ కురుమ సంఘం అధ్యక్షులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జయంతిని పురస్కరించుకొని మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ
ఆయన స్ఫూర్తితోనే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకుర్మ దేవునూరి బాలయ్య, షెల్బోజీ సోమన, బాలయ్య, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, షేక్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాల్ రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ గ్రామస్థులు పాల్గొన్నారు.