Take a fresh look at your lifestyle.

పర్యాటక కేంద్రం రాముని గుండాల్లో పరిశుభ్రత

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా బుధవారం రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పర్యాటక కేంద్రమైన రాముని గుండాల ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు.పిచ్చి చెట్లు,పొదలను తొలగించారు. పర్యాటక కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పర్యాటకులను కోరారు. అంతకుముందు ఎయిట్ ఇంక్లైన్ కాలనీ లో రహదారి వెoబడి పిచ్చి చెట్లు, పొదలు తొలగించారు. జనగామ లో ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం,హోమ్ కంపోస్టింగ్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకటస్వామి, సానిటరీ ఇన్స్పెక్టర్లు, కిరణ్, వార్డు అధికారులు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్వేత, ఆర్ పిలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.