Take a fresh look at your lifestyle.

భూసార పరీక్ష రైతన్నకు రక్ష: కలెక్టర్ రాహుల్ రాజ్

ముద్ర ప్రతినిధి, మెదక్: భూసార పరీక్ష రైతన్నకు రక్ష అని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్ పల్లి రైతు వేదికలో ఇక్రిసాట్, లారస్ ల్యాబ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా కలిసి రైతులు వ్యవసాయ సంక్షేమం కోసం భూ పరీక్ష వాహనం ద్వారా రైతుల ముంగిట్లో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలను నేల ఆరోగ్య కార్డు రూపంలో అందించడం జరుగుతుందన్నారు. పంటలకు సరైన మోతాదులో రసాయన ఎరువుల వినియోగం ద్వారా సమగ్ర పోషక యాజమాన్యం పాటించి పెట్టుబడి ఖర్చు తగ్గించడం తద్వారా అధిక దిగుబడులు సాధించుకుంటూ నేల సంరక్షణపై అవగాహన కల్పించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. పుష్పాజిత్ చౌదరి, విజయ రంగనాథ్, ఎడిఎ విజయ నిర్మల, ఎంఈఓ మదన్ మోహన్, ఎంఎఓ బాల్ రెడ్డి, ఏఈవోలు, రైతులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

  • విద్యార్థులు రాణించాలి.

విద్యార్థులు బాగా చదువుకొని బాగా రాణించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. తరగతుల వారీగా బోధన విద్యార్థుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాచారం మధుమోహన్, సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, సుకన్య, పంతంగి శ్రీనివాస్, ఎల్. మల్లారెడ్డి, సందీప్, కృష్ణ, రాజేందర్ రెడ్డి, సంతోషి కుమారీ, గంగమణి, కృష్ణవేణి, వినోద్, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, శశి కుమార్ రెడ్డి, శశి కుమార్, చక్రపాణి, కొండల్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఎమ్మార్సీ సిబ్బంది సందీప్, గిరి, గంగాధర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.