Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ భూములను సేద్యం చేసుకుంటున్న పేదలకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి

 

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

జిల్లాలో ఐదు మండలాల్లో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ పేదలందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరిలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల మహాసభలో ముఖ్య అతిధులుగా యాదగిరి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు భూమి లేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12 వేల రూపాయలు ఇస్తానని రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ నెల 15న దేశవ్యాప్తంగా ఉపాధి హామీ రక్షణ కోసం నిర్వహిస్తున్న గ్రామీణ సమ్మెలో ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 15 మందితో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నోముల జ్యోతి, కార్యదర్శిగా పల్లెర్ల అంజయ్య, ఉపాధ్యక్షులుగా కొండపురం యాదగిరి, మాణిక్యం, సహాయ కార్యదర్శులుగా కూకుట్ల చొక్కాకుమారి, నరాల చంద్రయ్య, బొల్లెపల్లి కిషన్ మిగతా 8 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, బోడ ఆంజనేయులు, రవి, సుధాకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.