Take a fresh look at your lifestyle.

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ నగేష్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజకవర్గం మామడ మండలానికి చెందిన 143 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి – షాది ముబారక్ చెక్కులను ఎంపీ గోడం నగేష్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. మహిళలకు ఇస్తామన్న అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని విమర్శించారు. పెళ్లైన ఆడబిడ్డలకు సైతం తులం బంగారం ఇస్తామంటూ బూటకపు హామీలు ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండ్ర రాజారెడ్డి, సత్యం చంద్రకాంత్, మండల నాయకులు బాపు రెడ్డి, గోవర్దన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సూరి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.