.
కొనసాగుతున్న పోలీసుల ముందస్తు అరెస్టులు…
టీ.యూ.ఎస్ జిల్లా అధ్యక్షులు చింతల గంగాధర్ అరెస్టు.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
తెలంగాణ రాష్ట్రం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి నట్లే తెలంగాణ ఉద్యమకారులను కూడా మాయమాటలతో మోసం చేయడానికి ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుందని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ చింతల ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు నివ్వగా జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, అందులో తెలంగాణ ఉద్యమకారులకు కూడా సముచిత న్యాయం చేస్తామని హామీలు గుప్పించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యమకారుల సమస్యలపై కార్యాచరణ ప్రారంభించడం శోచనీయమని ఆయన అన్నారు. ఏ ఉద్యమకారులనైతే పావులుగా వాడుకొని గద్దెనెక్కిన ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహారిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని దానికోసం నిన్న మిమ్మల్ని గద్దెనెక్కించిన తెలంగాణ ఉద్యమకారులే రేపు గద్దె దించేందుకు కార్యోన్ముఖులౌతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.