Take a fresh look at your lifestyle.

నిరుద్యోగంతో యువతి ఆత్మహత్య: కేపీహెచ్‌బీలో విషాదం

ముద్ర కూకట్‌పల్లి :

ఉద్యోగం లేదనే మనస్తాపంతో ఓ యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఖమ్మంకు చెందిన మాసనం సైదులు కుటుంబం గత ఆరు నెలలుగా కేపీహెచ్‌బీ రైతు బజార్ వెనుక నివాసం ఉంటోంది.
మంగళవారం ఉదయం సైదులు తన భార్యతో కలిసి చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. కుమారుడు సూరజ్ పనికి వెళ్లగా, కుమార్తె సుష్మ (27) ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆసుపత్రి నుంచి సైదులు ఫోన్ చేయగా సుష్మ తీయకపోవడంతో, అనుమానం వచ్చి కింద అంతస్తులో ఉండే పొరుగు నివాసి కి సమాచారం అందించారు. ఆమె వెళ్లి చూడగా పెంపుడు కుక్క నిరంతరాయంగా అరుస్తుండటం, లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
​కుమారుడు సూరజ్ తక్షణమే ఇంటికి చేరుకుని చూడగా, సుష్మ బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
​కుటుంబ సభ్యుల కథనం ప్రకారం
​సుష్మ గతంలో విప్రో కంపెనీలో పనిచేసేది.
​మూడేళ్ల క్రితం ఉద్యోగం కోల్పోవడంతో అప్పటి నుంచి ఖాళీగా ఉంది.
​కొత్త ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి, డిప్రెషన్‌కు గురైంది.
​ఈ ఘటనపై తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతిపై తండ్రి ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదు.

Leave A Reply

Your email address will not be published.