- తల్లి మృతి ప్రాణం తో ఉన్న మగ శిశువు.
- బాలింత మృతదేహంతో ఆసుపత్రి ముందు బంధువుల ధర్నా.
అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం తో బాలింత మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.వివరాలలోకివెళ్తేఅచ్చంపేట ప్రైవేటు వైద్యుల నిర్వాకం వలన ఓ మహిళ డెలివరీ అనంతరం తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి అనే నిండు గర్భిణిపట్టణంలోని ఎంఎంఆర్ ప్రైవేట్ ఆసుపత్రిలోబుధవారం సాయంత్రం స్కానింగ్, వైద్యంకోసంవెళ్ళామని బాలింత బంధువులు తెలిపారు. అంతకుముందు రోజుప్రభుత్వ ఆసుపత్రిలో చెకప్ చేయించగాడెలివరీకి ఇంకా పదిరోజుల సమయం ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారన్నారు.చెకప్,కోసంవెళ్తేప్రాణం తీశారని బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మృతురాలుప్రైవేటు ఆసుపత్రిలో ఒకసారి చెకప్ కి వెళితే ఆమెకు కల్ల బొల్లి మాటలు, చెప్పి సిజేరియన్ చేయడంతో ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చిందన్నారు.సిజేరియన్ ఆపరేషన్ అనంతరం ఆ మహిళకు ఎంతకూ రక్తస్రావంఆగకపోవడంతో పరిస్థితి విషమంగా మారిందన్నారు.దీంతో ఆ మహిళను అక్కడి నుంచి నాగర్ కర్నూల్, కుతరలించగా అక్కడి వైద్యులు వైద్యం చేసేందుకు నిరాకరించారన్నారు. దీంతో అక్కడి నుంచి కల్వకుర్తికి, అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించగామహిళ మార్గమధ్యం లోనే మృతి చెందిందని బంధువులుఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహంతో బంధువులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు ఎం ఎం ఆర్ ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు డాక్టర్, రామకృష్ణ, స్ధానిక ప్రభుత్వా సుపత్రిలో డీ సీ హెచ్ గా విధులు నిరహిస్తు ప్రయివేటు ఆసుపత్రిని కొనసాగిస్తున్నాడని బంధువులు గ్రామస్తులు తెలిపారు.మహిళ మృతదేహంతో అచ్చంపేట ఎంఎంఆర్ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి బంధువులతోపాటుగ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంఎంఆర్ హాస్పిటల్ అనుమతిని రద్దు చేస్తూ దోషుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని యిలాంటి ఘటన లు మళ్ళీ పునరావృతం కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్, చేశారు.బాధిత కుటుంబానికి కుల నిర్మూలనా పోరాట సమితి, సీ ఐ టీ యూ నేతలు మద్దతు ఇస్తూ బాలింత శ్రావణి కి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామనిఅన్నారు.విషయంతెలుసుకున్న ఎంఎంఆర్ ఆసుపత్రినిర్వాహకులు ఆసుపత్రిని మూసుకొనివెళ్ళిపోయారు.పరిస్థితి విషమించి చేయి దాటి పోకుండా ఉండేలాఅచ్చంపేట ఎస్సై విజయభాస్కర్ తో పాటు లింగాల, బల్మూరు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అచ్చంపేట పట్టణం లో ప్రజలకు వైద్య పరంగా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రయివేటు లో చూయించాలంటే యిలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఏది ఏమైనా యిలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోకుండా చూడాలనీ ఎం ఎం ఆర్ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలనీ ఉన్న మిగతా ప్రయివేటు ఆసుపత్రుల లో కూడా నిరంతర పర్యావేక్షణ చేయాలనీ బాధిత బంధువులు గ్రామస్తులు డిమాండ్ చేశారు.
