Take a fresh look at your lifestyle.

బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి

  • కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వెంటనే స్పందించాలి.
  • రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో అమలవుతున్నట్టుగా తెలంగాణలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రం సహకరించాలి.
  • ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపడంలో ట్రంప్ జోక్యం ఉందా లేదా పార్లమెంట్లో మోడీ చెప్పాలి.
  • సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ.
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రంపు జోక్యంతో పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగిందని అనేకసార్లు ప్రకటన చేశారు ట్రంపు. వాటిపై పార్లమెంట్లో మోడీ అవునా కాదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో మీడియా మీడియా సమావేశము సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ దాడిలో 26 మంది అమాయకులు ఉగ్రవాదుల చేతులు హతమయ్యారని కాశ్మీర్ ఆక్రమిత స్థలాన్ని ఆక్రమించుకునే వరకు యుద్ధం జరుపుతామని చెప్పి రెండు రోజులకే యుద్ధాన్ని ముగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంపు పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపేయాలని అనేకసార్లు ప్రకటన చేశారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కాశ్మీర్ లోజరిగిన దాడి ఉగ్రవాదులను అంతం అందించక ముందే యుద్ధాన్ని ఆపడాన్ని సరైనది కాదని చెప్పి యుద్ధం ఎవరి వలన ఆపాల్సి వచ్చిందని ఒకవేళ ట్రంపు చెప్పితే ట్రంప్ ద్వారా ఆపేరా లేదా అనే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నాయకులు పార్లమెంటు సభ్యులు అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు మోడీ వీటిపట్ల స్పందించి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్ సంబంధించింది తెలంగాణ ప్రభుత్వము గవర్నర్ ను కలిసి ఆడినెన్సు తీసుకువచ్చి ప్రత్యేకంగా అమలు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి చెబుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇద్దరు బిజెపి మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లు వెంటనే స్పందించాలి మోడీ పట్ల ఒత్తిడి తీసుకువచ్చి అమలు చేసేటందుకు ప్రత్యేక చొరవ చూపాలని వారిని డిమాండ్ చేశారు.బిజెపి పాలిత రాష్ట్రాలు రాజస్థాన్ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్ పెంచుకునే అవకాశం మోడీ ప్రభుత్వం కల్పించినప్పుడు తెలంగాణలో ఎందుకు అట్లాంటి అవకాశం ఇవ్వాలేదని ప్రశ్నించారు.

స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్ బీసీలకు సిపిఎం పార్టీగా మేము సంపూర్ణం గా స్వాగతిస్తున్నాము అది అమలు చేయాలని కూడా కోరుతున్నాం అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలన్ని వెంటనే అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మహిళలకు ₹2,500 ఇస్తామని చెప్పి గత ప్రభుత్వము దళితులకు 10 లక్షలు ఇస్తున్నట్టుగానే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అట్లాగే రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలోనే రెండు లక్షల ఉద్యోగలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి ఇచ్చిన హామీను అమలు చేయాలని ప్రభుత్వాన్ని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.గురుకులాపాఠశాలలో, హాస్టల్స్లలో చదువుకుంటున్న విద్యార్థులకు కలుషిత ఆహారంతో అస్వస్థత గురవుతున్న విషయంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి విచారణ చేసి వాటిపట్ల ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలి మెనూ అమలు చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేసే దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయకపోతే క్షేత్రస్థాయిలో ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల్లో గ్రామస్థాయిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించి స్థానిక సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అప్పటికి స్పందించకపోతే రాష్ట్రస్థాయిలో భారీ ఎత్తున ప్రజా పోరాటాలు తప్పవని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ప్రభుత్వము నేరుగా సబ్సిడీ రూపంలో రైతులకు అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని ప్రపంచవ్యాప్తంగానే అనేక దేశాల్లో ఆస్ట్రేలియా లాంటి దేశం నుంచి మన దేశానికి పాలు దిగుమతి చేసుకోవాలంటే 30 రూపాయలకు లీటరు ఇస్తామని చెబుతుందంటే ఆ దేశంలో రైతులకు పూర్తిస్థాయిలో సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని మనదేశంలో అందించకపోవడం దుర్మార్గం అని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగానికి సబ్సిడీగా పూర్తిస్థాయిలో అందించి ఆదుకునేటట్టుగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. రైతాంగానికి యూరియా కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో 12,000 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువులు రావలసింది 9000 టన్నులు మాత్రమే సప్లై చేసి కొరత సృష్టిస్తూ రైతాంగానికి ఎరువులు అందుబాటులో లేకుండా చేయడానికి మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తిస్థాయిలో సబ్సిడీ రూపంలో యూరియా ఎరువులు అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని కార్మిక హక్కులను కాలరాస్తుందని రైతాంగాని దివాలా తీస్తుందని వ్యవసాయ కూలీలను కోత విధిస్తూ నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో రైతాంగాన్ని విద్యారంగాన్ని వైద్యా రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వమే చేపట్టే విధంగా ప్రత్యేక చర్యలు చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ వెంకట్ రాములు ఎం ధర్మానాయక్ జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు కార్యదర్శి వర్గ సభ్యులు దేశా నాయక్ జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్ నాగరాజు మండల కార్యదర్శి సైదులు, సయ్యద్, సైదులు, నిర్మల రాములు శివకుమార్, బక్కయ్య వెంకటయ్య ఆంజనేయ రవి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.