Take a fresh look at your lifestyle.

వేములవాడలో ’మంత్రి అడ్లూరి‘ ప్రత్యేక పూజలు..

ముద్ర, వేములవాడ:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి గారు రాజన్నకు కోడెమొక్కులు చెల్లించుకున్నారు.

మంత్రి వేములవాడ ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ పూజారులు మంత్రి గారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి స్వామి వారి తీర్ధం ప్రసాదాలు అందజేశారు. అనంతరం బద్ది పోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.