Take a fresh look at your lifestyle.

సరిహద్దులో నిఘా కరువు * అధికారుల సన్నులలలో ఇసుక రవాణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:

తెలంగాణ -కర్ణాటక సరిహద్దులో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్, టిప్పర్ ల ద్వార అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటుతున్నా, సరిహద్దు ప్రాంతాల వద్ద తనిఖీలు నామమాత్రంగానే సాగుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రం నుంచి ధరూర్‌, కేటిదొడ్డి సరిహద్దు గ్రామాలలో‌ నిత్యం పట్టపగలే అక్రమ ఇసుక రవాణ నడుస్తోంది.
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని కృష్ణానదీ తీర ప్రాంతాలైన సజ్జపురం, యాపల్ దిన్నె, గాజులపాడు ప్రాంతాల‌ నుంచి‌ ధరూర్, కేటిదొడ్డి మండలాలకు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరిహద్దు మండలాలో గల నెట్టెంపాడు, ఈర్లబండ, ద్యాగర్ దొడ్డి,‌ నీళ్లహళ్లి, పాతపాలెం, పాగుంటా , వెంకటాపురం, ఇర్కిచేడు , గువ్వలదిన్నె, తదితర గ్రామాలలో అధికారుల నిఘా కరువైందని,‌ దీంతో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖల అధికారుల కళ్ళముందే ఈ అక్రమ రవాణా సాగుతున్నా, వారు కనీసం పట్టించుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి ఈ దందాను ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి. సరిహద్దుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు అక్రమ ఇసుక రవాణను అడ్డుకోవల్సిందిగా పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.