కమాన్ పూర్/ముత్తారం, ముద్ర: రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. గురువారం కమాన్ పూర్, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఆవరణలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ” జై బాపు, జై భీమ్, జై సంవిధన్ అభియాన్ సన్నాహక సమావేశం లో వారు పాల్లొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. కేంద్రంలోని అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు.బీజేపీ రాజ్యాంగ మార్పు కుట్ర ప్రజలకు తెలియజేయాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని, ఈ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగం, అంబేద్కర్ పై జరుగుతున్న కుట్రలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ గ్రామానికి తిరిగి ప్రజలకు తెలియచేయలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తొట్ల తిరుపతియాదవ్, కోలేటి మారుతి, కార్యకర్తలు పాల్గొన్నారు పరామర్శ కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గడప క్రిష్ణ మూర్తి వాళ్ళ అక్కయ్య గడప రాజేశ్వరి ఇటీవల అనారోగ్యంతో మరణించగా గడప కృష్ణమూర్తిని గురువారం కాంగ్రెస్ నాయకుడు, శ్రీపాదరావు ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు పరామర్శించారు. ఆమె చిత్రపటం వద్ద పూలు వేసి నివాళి అర్పించారు. అలాగే కమాన్ పూర్ ఇస్లాంనగర్ కి చెందిన మహమ్మద్ ముజాహిద్ మృతిచెందగా వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.