- అధ్యక్షులుగా డి. కిరణ్ కుమార్ విజయం.
ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో గురువారం న్యాయవాదుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, అధ్యక్షులుగా డి కిరణ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా వెంకటరమణలు విజయం సాధించారు, అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీపడ్డారు, డి.కిరణ్ కుమార్, మోహన్ కుమార్ యాదవ్, రామచంద్రారెడ్డిలు పోటీ పడగా ఐదు ఓట్ల మెజార్టీతో డి. కిరణ్ కుమార్, మోహన్ కుమార్ యాదవ్ పై గెలుపొందారు, వనపర్తి బార్ అసోసియేషన్లో మొత్తం 147 ఓట్లుండగా 137 ఓట్లు పోలయ్యాయి, అందులో కిరణ్ కు 55, మోహన్ కుమార్ యాదవ్ కు50, రామచంద్రారెడ్డికి 32 ఓట్లు వచ్చాయి, జనరల్ సెక్రెటరీగా కే. వెంకటరమణ గెలుపొందారు.అలాగే కోశాధికారిగా జి. రాజు, మహిళా ప్రతినిధిగా కళ్యాణి విజయం సాధించారు. మిగిలిన పోస్టులు ఉపాధ్యక్షులుగా శ్యామ్, జెయింట్ సెక్రెటరీగా శంకర్, లైబ్రరీ సెక్రటరీగా యాదగిరి, స్పోర్ట్స్ సెక్రటరీగా రాంధులి, ఈసీ మెంబర్లుగా శ్రీనివాస్ గౌడ్, ఎన్ రాజు,ఎండి నిరంజన్, భరత్ కుమార్, నరేందర్ బాబులు ఏకగ్రీవం అయ్యారు.ఎన్నికల అధికారులుగా హడాక్ కమిటీ సభ్యులు మోహన్ గౌడ్, కృష్ణమోహన్లు వ్యవహరించారు, గెలుపొందిన కమిటీ సభ్యులను న్యాయవాదులు కోర్టు ఆవరణలో సన్మానించి అభినందనలు తెలిపారు, కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.