- నియామక పత్రాన్ని అందజేసిన ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, ముద్ర: పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ మెంబర్ గా మంథని సురేష్ ను నియమించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం నుండి జారీ చేసిన నియామక పత్రాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా గురువారం మంథని సురేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు.పని చేసే వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుందని అందుకు సురేష్ నియామకమే నిదర్శనమని అన్నారు.ఈ సందర్భంగా మంథని సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నా పేరు ప్రతిపాదన చేసి నన్ను నియమించడం పట్ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,సీనియర్ నాయకులు నర్సింగారావు,పెరవెన లింగయ్య యాదవ్, మంతిని సత్యం తదితరులు పాల్గొన్నారు.