- జిల్లా పూర్వ కార్యదర్శి గోవర్ధన్ పిలుపు.
యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: ఈ 17 న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పెద్దపల్లి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, పార్టీ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్తానిక పార్టీ కార్యాలయంలో పార్టీ కమాన్ పూర్ మండల కార్యదర్శి కందుకూరి రాజారత్నం అధ్యక్షతన జరిగిన కమాన్ పూర్ మండల స్తాయి ముఖ్య కార్యకర్తల సమేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ మహా సభలు నిర్వహించి, తద్వారా నూతన నాయకత్వాన్ని ఎన్నుకుని, భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ జాతీయ సమితి నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 న జరిగే జిల్లా మహాసభల్లో, అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన మండల స్తాయి కార్యకర్తలను కోరారు. ఈ మహాసభలకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరౌతారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియూసి నాయకులు ఎల్.ప్రకాష్, బ్రాంచి కార్యదర్శి జీగురు రవిందర్, సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు బుర్ర తిరుపతి, సీనియర్ నాయకులు కొండ్ర సత్యనారాయణ, కొంకటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.