Take a fresh look at your lifestyle.

రైతంగానికి నీళ్లవ్వడం చేతకాక పోతే కేసీఆర్‌ కు కాళేశ్వరంప్రాజెక్టు అప్పగించండి

  • మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
  • అజ్ఞాని రేవంత్ రెడ్డి పాలనలో తిరోగమనంలో తెలంగాణ రాష్ట్రం.
  • ముర్కపు పాలనతో ప్రజలు విసిగిపోయారు. 
  • మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రం లో రైతంగానికి సాగునీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అన్నాదాతలను అరిగోస పెడుతుందని ప్రస్తుతం రైతాంగాని కి సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు సిద్దంగా  ఉన్నాయని, రైతంగానికి నీళ్లవ్వడం చేతకాక పోతే కేసీఆర్‌ కు కాళేశ్వరంప్రాజెక్టు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.అదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మాజీ ఎమ్మెల్యే  చందర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కోరుకంటి చందర్ తో కలసి మంత్రి మాట్లాడారు.కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి లో ముందుకు సాగి సుభిక్షంగా ఉంటే అజ్ఞాని రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. ముర్కపు పాలనలో ప్రజలు విసిగి పోతున్నారన్నారు.తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పల పాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ సర్కారు రైతాంగానికి కావాలనే నీళ్లు అందించడం లేదన్నారు.లక్షలాది ఎకరాలకు కావలసిన సాగునీరు సిద్ధంగా ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు,కంపు మాటలతో కాలం వెళ్లదిస్తుందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి,నీళ్ల మంత్రి అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని,కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అప్పుల పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు జోన్ పరిధిలో మెడిగడ్డ,అన్నారం, సుందిళ్ల,కన్నెపల్లి బ్యారేజిలకు ఎలాంటి ఇబ్బందులు లేవని లక్షలాది ఎకరాలకు నీళ్లందించేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అజ్ఞాని ముఖ్యమంత్రి రేవంత్,నీటిపారు దల శాఖ మంత్రికి సాధారణ వర్ష పాతం లేన్నప్పుడు బ్యారేజి లోని నీటి  నిల్వలు వాడుకోవాలన్నా సోయి లేదన్నారు.ఈ విలేఖరుల సమావేశం లో నాయకులు కౌశిక హరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.