Take a fresh look at your lifestyle.

షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలోని నాగార్జున నర్సింగ్ కాలేజీలో ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం షి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ముందుకు రావాలనే సందేశాన్నిచ్చారు. సైబర్ క్రైమ్‌ల గురించి వివరించారు. మొబైల్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ దాడులు జరిగే విధానం, వాటి నుంచి ఎలా రక్షించుకోవటం అనే విషయాలపై అవగాహన కల్పించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 / 112 నంబర్లకు కాల్ చేయాలని, అలాగే సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ ఉపయోగించాలని సూచించారు. టీ-సేఫ్ యాప్ ద్వారా కూడా సహాయం పొందవచ్చని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.