ముద్ర,వీపనగండ్ల: వీపనగండ్ల,చిన్నంబావి మండలాల్లోని ప్రజలు అత్యవసర సమయాలలో 108 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్, 108 అంబులెన్స్ జిల్లా కోఆర్డినేటర్ రత్నం తెలిపారు. ఉమ్మడి మండలంలో ఆయా గ్రామాల్లో ఎవరైనా ఎటువంటి అత్యవసరపరిస్థితి లోనైనా మహిళలకు పురిటి నొప్పులు ( ప్రెగ్నెన్సీ) వచ్చినప్పుడు, వాహన ప్రమాదాలు(యాక్సిడెంట్) జరిగినప్పుడు, పాయిజన్ (పురుగులమందు త్రాగడం)బ్రీతింగ్ గుండెనొప్పి, కొట్టుకొని గాయపడినప్పుడు వంటి సంఘటనలు, అంతేకాక పాము,తేలు,కుక్క కాటు,వాంతులు, షుగర్, బిపి, ఎక్కువైనా,తక్కువైనా పెద్ద ఆసుపత్రులకు వెళ్లి మెరుగైన చికిత్స చేయించుకోవడానికి 108 అంబులెన్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ముఖ్యంగా మహిళలు కాన్పు కోసం సొంత వాహనంలో కాకుండా 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.