ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: అంతర్జాతీయ వుహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సింగరేణి సేవా సమితి ఆర్ జి ఏరియా 1 ఆధ్వర్యంలో ఆర్.సి.ఓ.ఎ క్లబ్ లోఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిదులుగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీమణి శ్రీమతి శారద బలరాం,ఆర్జీ 1 ఏరియా జిఎం డి.లలిత్ కుమార్,ఆర్జీ1 సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి డి.అనిత లలిత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్త్రీ అంటే ఒక తల్లిగా,బిడ్డగా,చెల్లిగా,అక్కగా, భార్యగా,వదినగా,అత్తగా,పిన్నిగా ఇలా రకరకాల పోషించుతూ సమన్వయముతో తనదైన శైలిలో సమయంతో పరుగులు తీస్తూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్ర లా అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీ కి స్త్రీమూర్తులందరికీ వందనం తెలిపారు.ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రానిస్తున్నారని,ప్రతి ఒక్క మహిళా కష్ట పడి ఉన్నత స్థానాలను అధిరోహించాలని పస్తుతం మహిళలు పురుషులకు సమానంగా అన్నీ రంగాలలో రాణిస్తున్నారని అన్నారు,పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరాలని,కలెక్టర్ లు, ఐ.పి.ఎస్,డాక్టర్ లు,లాయర్ లు గా ఎదగాలని అన్నారు.ప్రతి ఒక్క మహిళా ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని తదనుగుణంగా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు.ప్రస్తుతం పోలీస్,బ్యాంక్స్, రైల్వే,గౌవర్నమెంట్ ఉద్యోగాలలో పురుషులకు సమానంగా మహిళలు పోటీ పడుతున్నారని అన్నారు.ఇప్పటికే మహిళలలో చైతన్యం వచ్చిందని మును ముందు కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరి స్వామి,సి.ఎం.ఓ.ఐ ప్రసిడెంట్ బి.మల్లేశం,డిజియం పర్సనల్ కిరణ్ బాబు, సీనియర్ పి.ఓ హన్మంతరావు,శ్రావణ్ కుమార్, సేవా సెక్రటరీ శ్రీమతి శిరీష చంద్ర శేఖర్,జాయింట్ సెక్రటరీ బీనా సింగ్,సోనాలి భైద్య,లక్ష్మీ శిరీష, కొ-ఆర్డి నేటర్లు తిరుపతి,రవి కుమార్,సేవా శిక్షకులు,అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.