రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఈ నెల 9 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి కోరారు.ఆదివారం రామకృష్ణాపూర్ నుంచి మందమర్రి బస్టాండ్ వరకు సిఐటియూ నాయకులు ర్యాలీ తీశారు. పని గంటల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఏఐసిడబ్ల్యుఎఫ్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడు రామస్వామి, వెంకటేష్, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.