- ఐలా చైర్మన్గా గోవిందరెడ్డి.
- సిఐఏ అధ్యక్షుడిగా డి.ఎస్.రెడ్డి.
కుషాయిగూడ , ముద్ర విలేఖరి: చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీ (ఐలా) , చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ (సి ఐ ఏ)కు వేర్వేరుగా జరిగిన ఎన్నికల్లో.. దీపం ప్యానెల్ ఘనవిజయం సాధించింది. శనివారం రాత్రి ఆలస్యంగా వెలువడిన ఫలితాలలో.. ఐలా చైర్మన్ గా గోవిందరెడ్డి, సిఐఏ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఐలా ఉపాధ్యక్షుడిగా టి శ్రీనివాస్, కార్యదర్శిగా జి.రాఘవయ్య, సంయుక్త కార్యదర్శిగా పి సురేష్, కోశాధికారిగా మల్లికార్జున్ రెడ్డి గెలుపొందారు. సిఐఏ ఎన్నికల్లో ఉపాధ్యక్షుదిగా వై సుధాకర్ రెడ్డి, కార్యదర్శిగా పిఎస్ మోహన్, సంయుక్త కార్యదర్శి గా గంగాధర్ బాబు, కోశాధికారిగా ఎస్ శ్రీనివాస్ విజయం సాధించారు. రెండు ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా దీపం ప్యానెల్ అభ్యర్థులే గెలుపొందారు. ఇక ఐలాలో 798 ఓట్లు గాను 714 ఓట్లు పోలయ్యాయి. సి ఐ ఏ లో 495 ఓట్లు ఉండగా 436 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఐలా చైర్మన్ గోవిందరెడ్డి, సిఐఏ అధ్యక్షుడు డిఎస్ రెడ్డి లతో పాటు గెలుపొందిన అభ్యర్థులందరినీ పలువురు పారిశ్రామికవేత్తలు సన్మానించి అభినందనలు తెలిపారు. అలాగే చర్లపల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని గోవింద రెడ్డి, డి ఎస్ రెడ్డి తెలిపారు.ఎన్నికల్లో దీపం ప్యానెల్ కు మద్దతు ఇచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
