Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్య రక్షణకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు కార్యక్రమ నియోజకవర్గ ఇంచార్జి ఎన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డిలు పిలుపునిచ్చారు.యాచారం మండలం నంది వనపర్తి, మంథన్ గౌరెల్లి, చింతపట్ల గ్రామాల్లో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంఖాల దాసు, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ కరుణాకర్, బిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, నాయకులు అమృత సాగర్, ఎన్ను భరత్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.