Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం -మంత్రి పొంగులేటి

 

అక్రిడిటేషన్ కమిటీలో పరిగణలోకి జర్నలిస్టుల సూచనలు టీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

ముద్ర, హైదరాబాద్ :

రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ తో పాటు వెబ్ మీడియాలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోన్న జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప‌విత్ర రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం, సేవాభావం, మానవత్వానికి ప్రతీకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడేషన్ కార్డుల జారీలో, అక్రిడేషన్ కమిటీ ఏర్పాటులో, జర్నలిస్టుల అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచే జర్నలిస్టులు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్న పొంగులేటి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారధిలా పనిచేస్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థల సెక్రటరీ జఫర్ జావేద్, పిస్తా హౌస్ సీఈఓ ఎం.ఏ. మజీద్, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ఎం.ఏ. మజీద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.