Take a fresh look at your lifestyle.

ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలకం- అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్:
అభివృద్ధి సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు, ప్రణాళికల రూపకల్పనలో జన గణన కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు .


మంగళవారం కలెక్టర్ లో చార్జి అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న తొలి జనగణన అని, 2011 జనాభా గణన తర్వాత
2021 లో నిర్వహించ వలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా 2027లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలలో జనాభా పరంగా, పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని, రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని అన్నారు. క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా సిద్ధంగా ఉండాలని, పైస్థాయి అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుని జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను సి.ఎం.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ చేయడంపై శిక్షణలో వివరించారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.